![]() |
![]() |

సీరియల్స్ లో నటిస్తూ తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుని, బిగ్‌బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా వెళ్లిన కీర్తి భట్ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ జరుపుకుంది. త్వరలో యాక్టర్ కార్తీక్‌తో కీర్తి ఏడడుగులు వెయ్యబోతోంది. వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. "మా బోనాలు జాతర" షోలో వీళ్ళ నిశ్చితార్థం స్టార్ మా నటీ నటుల మధ్యన చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ షోలో కీర్తి తన జీవితంలో జరిగిన విషయాలను చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. యాక్సిడెంట్‌లో కుటుంబాన్ని కోల్పోయిన కీర్తి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. అప్పట్లో ఒక పాపను కూడా ఆమె దత్తత తీసుకుని పెంచుకుంది. ఐతే బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన టైములో అనారోగ్య కారణాలతో ఆ పాప చనిపోయింది. ఇక విజయ్ కార్తీక్ తోటతో కీర్తి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
"కీర్తికి ఫామిలీ లేదు అన్న బాధ లేకుండా నేను చూసుకుంటాను" అని కార్తీక్ చెప్పాక "నీకు నేను తోడుగా ఉంటాను.. నీ తల్లిదండ్రులను నా పేరెంట్స్ గా చూసుకుంటాను... నన్ను వదలకుండా ఇలాగే చూసుకో’ అంటూ కంటతడి పెట్టుకుంది కీర్తి. తర్వాత ఈ జంట రింగ్స్ మార్చుకున్నారు. కార్తీక్ పేరెంట్స్ గురించి కీర్తి మాట్లాడింది. "నేను వారి వంశాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లలేనని తెలుసు. ఆ విషయాన్ని వాళ్లకి చెప్తే ఒకటే మాట అన్నారు. నీకు పాప ఎందుకమ్మా, నువ్వే మా పాపా. మనం పాపని దత్తత తీసుకుందాం’ అన్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కీర్తి. కీర్తికి కాబోయే భర్త కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లి అతని స్వస్థలం. సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చాడు కార్తీక్. కన్నడలో హీరోగా ఫోర్ మూవీస్ లో నటించాడు. తెలుగులో ‘ఏబీ పాజిటివ్’, ‘చెడ్డీ గ్యాంగ్’ వంటి మూవీస్ లో కనిపించాడు. ఇక ఈ జంటకు అందరూ విషెస్ చెప్తున్నారు.
![]() |
![]() |